
ట్యాగ్ · 2 కథనాలు


'మహానటి' ఖాతాలో మరో అవార్డ్

"జెర్సీ "మూవీ కి నేషనల్ అవార్డ్ పై హీరో నాని స్పందన
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని , శ్రద్ధా శ్రీనాథ్ జంటగా క్రికెట్ నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "జెర్సీ " మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నాని , హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నేషనల్ అవార్డ్స్ లో "జెర్సీ "మూవీ ఉత్తమ చిత్రం గా ఎంపిక అయ్యింది. ఈ సందర్భంగా స్పందించిన హీరో నాని ఒక వీడియో ను రిలీజ్ చేశారు.

'మహానటి' ఖాతాలో మరో అవార్డ్
'మహానటి' సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది కీర్తి సురేష్. ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిలోభాగంగానే జాతీయ అవార్డు కూడా దక్కిన సంగతి తెలిసిందే. 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఈ ఏడాది ఆగస్ట్ లోనే ప్రకటించారు. అయితే నేడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా మహానటి అవార్డు ను సొంతం చేసుకుంది.