
ట్యాగ్ · 2 కథనాలు


'సుందరం' ట్వీట్ కు సూపర్ రెస్పాన్స్..!

సాంగ్ చిత్రీకరణ లో "అంటే .. సుందరానికీ! "
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ పేరుతో నటిస్తున్నారు.ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కనున్న “దసరా “మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.

'సుందరం' ట్వీట్ కు సూపర్ రెస్పాన్స్..!
ఈరోజుల్లో ఒక సినిమా ప్రమోషన్ ఎంత డిఫరెంట్ గా ఉంటే అంత క్రేజ్ ను సొంతం చేసుకుంటుంది. అందుకే ఏదో ఒక విభిన్నత ఉండేలా చూసుకుంటారు. ఇక ఇప్పుడు నానిచేసిన ట్వీట్ కూడా సినిమా ప్రమోషన్ కు అలానే ఉపయోగపడింది అంటున్నారు. అసలు సంగతేంటంటే.. ఇటీవల వాయిదా పడ్డ సినిమాలన్నీ కొత్తగా రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో కొన్ని సినిమాలు మాత్రం ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి రెండు రెండు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో నాని కూడా తన కొత్త సినిమా అంటే సుందరానికి సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశాడు. అయితే నాని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రిలీజ్…