ట్యాగ్ · 2 కథనాలు

ఈ ఏడాది కళ్యాణ్ రామ్‌కి ఎంతో స్పెషల్
కళ్యాణ్ రామ్‌తో మరోసారి కె.వి.గుహన్ ?
యువ కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ కె.వి.గుహన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘118’. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కాగా... కళ్యాణ్, గుహన్ కలయికలో మరో సినిమా రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది కళ్యాణ్ రామ్‌కి ఎంతో స్పెషల్
కథానాయకుడిగా నందమూరి కళ్యాణ్ రామ్‌ది దాదాపు 16 ఏళ్ళ సినీ ప్రస్థానం. రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే ఈ టాలెంటెడ్ హీరో... ఈ 16 ఏళ్ళలో కేవలం 16 చిత్రాలకే పరిమితమయ్యాడు. అంతేకాదు... కెరీర్ మొత్తమ్మీద... 2003, 2007, 2015, 2018 సంవత్సరాల్లో మాత్రమే కళ్యాణ్ రామ్... ఒకే ఏడాదిలో రెండేసి సినిమాలతో పలకరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే... ఈ ఏడాది మాత్రం కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా నాలుగు చిత్రాలతో అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడీ నందమూరి హీరో. అంతేకాదు... వరుసగా మూడు నెలల పాటు తన సినిమాలు విడుదలవుతుండడం విశేషం.