కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nandamuri Balakrishna Next Project News

ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

మల్టీ స్టారర్ మూవీ లో బాలకృష్ణ ?

టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ ల "F2", వేంకటేష్ , నాగచైతన్య "వెంకీ మామ" మల్టీస్టారర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. నాని, సుధీర్ బాబు నటించిన మల్టీ స్టారర్ మూవీ "V" విడుదలకు సిద్ధంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ "రౌద్రం రణం రుధిరం " మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. యంగ్ హీరోలతోపాటు సీనియర్ హీరోలు కూడా మల్టీ స్టారర్ మూవీస్ పై ఆసక్తి చూపుతున్నారు.

Team TFNవాట్సాప్
Nandamuri Balakrishna - Boyapati Legend Completes 6 Years
సినిమా వార్తలు

న‌ట‌సింహ బాల‌కృష్ణ ‘లెజెండ్’కు ఆరేళ్ళు

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయ‌పాటి శ్రీ‌నుది స‌క్సెస్‌ఫుల్ కాంబినేషన్. అలాంటి బాలయ్య, బోయపాటి క‌ల‌యిక‌లో ‘సింహా’(2010) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత వ‌చ్చిన రెండో చిత్రం ‘లెజెండ్‌’. బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేసిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ క‌థానాయిక‌లుగా న‌టించారు. జ‌గ‌ప‌తిబాబు, సుమ‌న్, బ్ర‌హ్మానందం, జ‌యప్రకాష్ రెడ్డి, అజ‌య్, బ్ర‌హ్మాజీ, ‘ఆహుతి’ ప్ర‌సాద్, సుజాతా కుమార్, క‌ళ్యాణి, ఈశ్వ‌రీ రావు, సితార‌ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. సుహాసిని అతిథి పాత్ర‌లో కనిపించగా... హంసా నందిని ఐట‌మ్ సాంగ్‌లో న‌ర్తించింది.

Team TFNవాట్సాప్
Nandamuri Balakrishna To Act In A Telugu Remake Of A Malayalam Movie
సినిమా వార్తలు

మ‌ల‌యాళ రీమేక్ లో బాల‌కృష్ణ‌?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ప‌లు రీమేక్ చిత్రాల్లో న‌టించ‌డ‌మే కాకుండా... ఘ‌న‌విజ‌యాల‌ను సైతం అందుకున్నారు. త‌న కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల‌చిన `మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు` రీమేక్ మూవీనే. అలాగే `ముద్దుల మావ‌య్య‌`, `ల‌క్ష్మీ న‌ర‌సింహ‌`... ఇలా ప‌లు స‌క్సెస్ ఫుల్ రీమేక్స్ లోనూ న‌టించిన వైనం బాల‌య్య సొంతం. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, ఆపై బి.గోపాల్ డైరెక్ష‌న్ లో మ‌రో సినిమా చేయ‌నున్న న‌ట‌సింహ‌... త్వ‌ర‌లో ఓ రీమేక్ ఫిల్మ్ లో న‌టించే అవ‌కాశ‌ముందట‌. అది కూడా.. ఓ మ‌ల్టీస్టార‌ర్ స‌బ్జెక్ట్ కోసం.

Team TFNవాట్సాప్

షేర్