
ట్యాగ్ · 3 కథనాలు


ఏడు కోణాల్లో సాగే పాత్రలో నాగశౌర్య
డబ్బింగ్‌లో `అశ్వథ్థామ`

మరో మూవీ కి నాగశౌర్య గ్రీన్ సిగ్నల్
మాస్ ఎంటర్ టైనర్ "అశ్వద్ధామ" మూవీ లో అద్భుతంగా నటించి ప్రేక్షక, విమర్శకుల ప్రశంసలు పొందిన నాగశౌర్య సినిమాల జోరు పెంచారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందే రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. నాగశౌర్య ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఏడు కోణాల్లో సాగే పాత్రలో నాగశౌర్య
ప్రేమకథలకు చిరునామాగా నిలచిన యువ కథానాయకుల్లో నాగశౌర్య ఒకరు. `ఊహలు గుసగుసలాడే`, `కళ్యాణ వైభోగమే`, `ఒక మనసు`, `జ్యో అచ్యుతానంద`, `ఛలో`.. ఇలా విభిన్న కోణాల్లో సాగే పలు ప్రేమకథల్లో అలరించాడు శౌర్య. కట్ చేస్తే... ఇప్పుడు ఒకే చిత్రంలో ఏడు కోణాల్లో సాగే విభిన్న పాత్రలో దర్శనమివ్వనున్నాడు శౌర్య.
డబ్బింగ్‌లో `అశ్వథ్థామ`
యువ కథానాయకుడు నాగశౌర్య కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రం `ఛలో`. హోమ్ బేనర్ ఐరా క్రియేషన్స్ లో నిర్మితమైన ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకున్నాడు శౌర్య. అయితే, ఆ తరువాత ఇదే సంస్థలో వచ్చిన `@ నర్తనశాల` నిరాశపరిచినా... ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రమే `అశ్వథ్థామ`. స్టన్నింగ్ బ్యూటీ మెహరీన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోందని సమాచారం. అంతేకాదు... బ్యాలెన్స్ ఉన్న పాటను త్వరలోనే…