
ట్యాగ్ · 2 కథనాలు


బిజీ యంగ్ హీరో నాగశౌర్య

న్యూ మూవీ కి నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ?
ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ దసరా పండగ కు పూజా కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. “పోలీసు వారి హెచ్చరిక”, “నారి నారి నడుమ మురారి “, “ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి” మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగశౌర్య ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

బిజీ యంగ్ హీరో నాగశౌర్య
హీరో నాగశౌర్య వరస మూవీ కమిట్ మెంట్స్ తో టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. స్వంత బ్యానర్ తో పాటు ఇతర బ్యానర్స్ లోనూ నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్నారు. హీరో నాగశౌర్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా "లక్ష్య " మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లోని క్యారెక్టర్ కై నాగశౌర్య 8 ప్యాక్ అబ్స్ సాధించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా "వరుడు కావలెను "మూవీ తెరకెక్కుతుంది.