ట్యాగ్ · 4 కథనాలు
కొత్త సినిమా సెట్లో అడుగుపెట్టిన 'నాగ శౌర్య'
హీరో నాగశౌర్య న్యూ లుక్

#NS20 మూవీ షూటింగ్ ప్రారంభం
బిజీ యంగ్ హీరో నాగశౌర్య
కరోనా మహమ్మారి కారణంగా 6 నెలల సుదీర్ఘ విరామం తరువాత చిత్ర పరిశ్రమ షూటింగ్స్ తో కళ కళ లాడుతుంది. సినీ సెలబ్రిటీస్ తమ మూవీ షూటింగ్స్ లో పాల్గొనడం శుభసూచికమే. వరస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీగా ఉన్న యంగ్ హీరో నాగశౌర్య , సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ లో సూపర్ హిట్ "పెళ్ళి చూపులు "మూవీ ఫేమ్ రీతూ వర్మ కథానాయిక.
కొత్త సినిమా సెట్లో అడుగుపెట్టిన 'నాగ శౌర్య'
కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్స్ లేక బోసి పోయిన సినీ పరిశ్రమకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. రాజమౌళినే షూటింగ్ మొదలు పెట్టాడంటే దాదాపు అందరూ మొదలు పెట్టేసినట్టే. ఇప్పటికే చాలా మంది మెదలుపెట్టగా.. ఎలా లేదనుకున్నా ఈ నెలాఖరుకల్లా అందరూ మొదలు పెట్టేస్తారు.
హీరో నాగశౌర్య న్యూ లుక్
"ఊహలు గుసగుస లాడే ", కల్యాణ వైభోగమే ", జ్యో అచ్యుతానంద ", చలో ", ఓ బేబీ ", "అశ్వద్ధామ "వంటి మూవీస్ తో నాగశౌర్య ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రాచీన క్రీడ ఆర్చరీ నేపథ్యంలో రూపొందుతున్న #NS20 మూవీ లో ఆర్చర్ గా నటిస్తున్నారు. ఈ మూవీ కై సిక్స్ ప్యాక్ అబ్స్ సాధించిన నాగశౌర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

#NS20 మూవీ షూటింగ్ ప్రారంభం
సోనాలి నారంగ్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా " #NS20 "మూవీ షూటింగ్ నిన్న (బుధవారం ) హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య కు జోడీగా "రొమాంటిక్ " మూవీ ఫేమ్ కేతిక శర్మ నటిస్తున్నారు. ఈ మూవీ లో తన క్యారెక్టర్ కై నాగశౌర్య సిక్స్ ప్యాక్ అబ్స్ ట్రై చేశారు.