
ట్యాగ్ · 2 కథనాలు

మరోసారి నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబో?

"థ్యాంక్ యూ " మూవీ లో 3 గెటప్స్ లో నాగచైతన్య
నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తరువాత నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హీరో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. కరోనా కారణం గా "లవ్ స్టోరీ " మూవీ షూటింగ్ వాయిదా పడింది. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ తరువాత నాగచైతన్య మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మరోసారి నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబో?
యువ కథానాయకుడు నాగచైతన్య కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `మనం` ఒకటి. తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుతోనూ, తండ్రి అక్కినేని నాగార్జునతోనూ కలసి నటించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్... హార్థికంగానూ, ఆర్థికంగానూ మంచి ఫలితాన్ని ఇచ్చింది. అలాంటి... `మనం`ని రూపొందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చైతూ. అంతేకాదు.. తన తొలి చిత్ర నిర్మాత `దిల్` రాజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తాడని వినిపిస్తోంది. త్వరలోనే చైతూ, విక్రమ్, `దిల్` రాజు కాంబినేషన్ మూవీపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.