ట్యాగ్ · 2 కథనాలు
బెంగళూరులో తెలుగు మూవీస్ హంగామా
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్స్ బంద్ అయిన విషయం తెలిసిందే. సుమారు 6 నెలల తరువాత మూవీ షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 15 వ తేదీ నుండి థియేటర్స్ ప్రారంభానికై కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యం లో బెంగళూరు లో కొన్ని థియేటర్స్ అయ్యాయి. సంక్రాంతి పండగకు రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన మహేష్ బాబు "సరిలేరు నీకెవ్వరు ", అల్లు అర్జున్ "అల .. వైకుంఠపురములో .. "నితిన్ "భీష్మ " మూవీస్ బెంగళూరు థియేటర్స్ లో రీ రిలీజ్ అయ్యాయి.
ఈ పరిస్థితిలో థియేటర్స్ ఓపెన్ చేస్తే వెళతారా? వెళ్ళరా?
2020 ఇలా ఉంటుందని ఎవరూ ఉహించనుకూడా ఉండరు. కరోనా వచ్చినా ఏదో రెండు మూడు నెలలు ఉంటుందేమో అని అనుకున్నారు కానీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు. ఇక ఈ కరోనా వల్ల ఎన్నో పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సినీపరిశ్రమకు కొన్ని కోట్లలో నష్టం కలిగింది. షూటింగ్స్ ఎలాగూ లేవు.. కనీసం థియేటర్స్ అయినా ఓపెన్ అవుతాయా.. ఆ బిజినెస్ అన్నా జరుగుతుందా అంటే అదీ లేకుండా పోయింది.