
ట్యాగ్ · 2 కథనాలు

ప్రభాస్ 'మిర్చి'కి 8 ఏళ్లు

9 వసంతాల "మిర్చి "
యు వి క్రియేషన్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క , రిచా గంగోపాధ్యాయ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "మిర్చి " మూవీ 2013 ఫిబ్రవరి 8 వ తేది రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 6 నంది అవార్డ్స్ అందుకుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. "మిర్చి "మూవీ తో కొరటాల శివ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రభాస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొరటాల శివ డైలాగ్స్ ప్రేక్షకులను అలరించాయి.
ప్రభాస్ 'మిర్చి'కి 8 ఏళ్లు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పలు విజయవంతమైన యాక్షన్ ఎంటర్టైనర్స్ లో సందడి చేసాడు. వాటిలో 'మిర్చి' ఒకటి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన తొలి చిత్రమిది. రచయిత నుండి దర్శకుడిగా మారిన ఈ సినిమాతో... శివ మొదటి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు. ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ నటించిన ఈ సినిమాలో సత్య రాజ్, నదియా, సంపత్ రాజ్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీతోనే ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ నిర్మాణ రంగంలోకి తొలి అడుగు వేయడం విశేషం.