
ట్యాగ్ · 2 కథనాలు

రిపీట్ మోడ్ లో రవితేజ రొమాన్స్

డిటెక్టివ్ పాత్రలో రవితేజ ?
"విక్రమార్కుడు ", పవర్ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో మాస్ మహారాజా రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఎటువంటి క్యారెక్టర్ లో నైనా తనదైన స్టైల్ లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ ఇప్పుడు మరో కొత్త క్యారెక్టర్ లో నటించనున్నారు.
రిపీట్ మోడ్ లో రవితేజ రొమాన్స్
గత చిత్రం `డిస్కో రాజా`లో ముచ్చటగా ముగ్గురు కథానాయికలతో సందడి చేశాడు మాస్ మహారాజా రవితేజ. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్.. ఇలా ఇదివరకు తను జోడీకట్టని భామలతోనే ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశాడాయన. కట్ చేస్తే.. రాబోయే చిత్రాల్లో మాత్రం అందుకు భిన్నంగా ఆల్రెడీ తను జట్టుకట్టిన నాయికలతోనే `రిపీట్` రొమాన్స్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు రవితేజ.