కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mani Sharma New Movie News

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

నితిన్ ‘పవర్ పేట్’కు మణిశర్మ స్వరాలు?

యువ కథానాయకుడు నితిన్, దర్శకుడు కృష్ణచైతన్య కాంబినేషన్‌లో ‘పవర్ పేట్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళనాట ఘనవిజయం సాధించిన ‘వడ చెన్నై’(2018) తరహాలో ఈ చిత్రం రూపొందనుంద‌ని టాక్. అంతేకాదు.. రెండు భాగాలుగా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నితిన్‌కు జోడిగా కీర్తి సురేష్ నటించనుండగా విలన్‌గా రావు రమేష్ దర్శనమివ్వనున్నాడని తెలిసింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Melody Brahma Mani Sharma - Mahesh Babu Combination To Spell Magic Once Again
సినిమా వార్తలు

మ‌హేష్ బాబు చిత్రానికి మ‌ణిశ‌ర్మ బాణీలు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి అచ్చొచ్చిన స్వ‌ర‌క‌ర్త‌ల్లో మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మదే అగ్ర‌శ్రేణి స్థానం. క‌థానాయ‌కుడిగా మ‌హేష్ తొలి చిత్రం `రాజ‌కుమారుడు`తో మొద‌లుకుని... మ‌హేష్ లో న‌టుడ్ని ప‌రిపూర్ణంగా వెలికి తీసిన `మురారి`, తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌చిన `ఒక్క‌డు`, `వ‌న్ అండ్ ఓన్లీ` ఇండ‌స్ట్రీ హిట్ అయిన‌ `పోకిరి` వ‌ర‌కు... ఇలా ప‌లు ద‌శ‌ల్లో మ‌ణిశ‌ర్మ సంగీతం ముఖ్య భూమిక పోషించింది. `ఖ‌లేజా` (2010) త‌రువాత మ‌ళ్ళీ ఈ కాంబినేష‌న్ లో మ‌ళ్ళీ పాట‌లు సంద‌డి చేయ‌నేలేదు. కాక‌పోతే, ఆ మ‌ధ్య `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` (2013)కి నేప‌థ్య సంగీత‌మందించాడు మ‌ణి.

Team TFNవాట్సాప్

షేర్