
ట్యాగ్ · 2 కథనాలు


మంచు మనోజ్ పెళ్లి డేట్ ఫిక్స్

వైభవంగా జరిగిన మంచు మనోజ్, మౌనికా రెడ్డి ల వివాహం
హీరో మంచు మనోజ్, మౌనికారెడ్డిల వివాహం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మంచు కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మనోజ్, మౌనిక వివాహ వేడుకలో పాల్గొన్నారు.ఫిల్మ్ నగర్‌లోని మోహన్‌బాబు ఇంటిలోనే వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. మనోజ్, మౌనిక పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. మంచు మోహన్‌బాబు, విష్ణుతో పాటు ఇతర కుటుంబసభ్యులు కొత్త జంటను ఆశీర్వదించారు.

మంచు మనోజ్ పెళ్లి డేట్ ఫిక్స్
మంచు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మనోజ్. అయితే మనోజ్ కు మాత్రం ఇప్పటివరకూ బ్లాక్ బస్టర్ హిట్ అనేది దక్కింది లేదు. కెరీర్ మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈమధ్య సినిమాలకు దూరమయ్యాడు. తన నుండి సినిమా వచ్చి కూడా చాలా కాలమైపోయింది. ఇక ఇదిలా ఉండగా గత కొద్దికాలంగా మనోజ్ రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే కదా. 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్.. బేధాభిప్రాయాలతో విడిపోయిన సంగత్ తెలిసిందే. మొదటి భార్య ప్రణతి రెడ్డి నుంచి 2019లో మనోజ్ విడాకులు తీసుకున్నాడు. ప్రణతి నుంచి విడాకులు తీసుకున్న తరవాత మంచు మనోజ్ మరో పెళ్లి చేసుకోరు…