
ట్యాగ్ · 2 కథనాలు


మొదటి సారి ఒకే స్క్రీన్ పై మోహన్ బాబు, మంచు లక్ష్మీ..!
మంచు మోహన్ బాబు వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఆయన తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆతరువాత కూతురు మంచు లక్ష్మీ కూడా బుల్లి తెర ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తుంది. ప్రస్తుతం ఎవరి ప్రాజెక్ట్ లతో వాళ్లు బిజీగా ఉన్నారు. అయితే మోహన్ బాబు తో మంచు విష్ణు, మంచు మనోజ్ ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకున్నారు కానీ మంచు లక్ష్మీ మాత్రం ఇప్పటివరకూ చేయలేకపోయింది. కానీ మొదటిసారి ఇప్పుడు తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి స్క్రీన్ ను షేరు చేసుకోబోతున్నారు.

'మాన్స్టర్'.. డబ్బింగ్ పూర్తి చేసుకున్న మంచు లక్ష్మీ
ఇప్పుడు తమిళ్, మలయాళం సినిమాలను కూడా తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అక్కడి హీరోలకు మన తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉండటంతో కొన్ని సినిమాలు సూపర్ హిట్ కూడా అవుతున్నాయి. ఇక మలయాళ లెజెండరీ నటుడు మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇటీవల డైరెక్ట్ గా తెలుగులో జనతా గ్యారెజ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు 'మాన్స్టర్' సినిమాతో రానున్నాడు. వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా.. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.