
ట్యాగ్ · 2 కథనాలు

అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’కు ఆరేళ్ళు

మనం సినిమాకు 10 ఏళ్ళు.. స్పెషల్ రిలీజ్
టాలీవుడ్‌కు రెండు కళ్ళు అనదగ్గవారిలో ఒకరు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కాగా.. మరొకరు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). ఈ ఇద్దరు అగ్ర హీరోలు అన్ని రకాల పాత్రలు పోషించినప్పటికీ ఎన్టీఆర్ మాస్ హీరోగా పేరు తెచ్చుకోగా, ఏఎన్నార్ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందారు. వీరిలో ఎన్టీఆర్ 1995లోనే తనువు చలించగా, ఏఎన్నార్ 2014లో పరమపదించారు. తుదిశ్వాస విడిచేవరకూ ఏఎన్నార్ సినిమాలలో నటించడం విశేషం. ఈ క్రమంలో ఆయన నటించిన చివరి చిత్రం 'మనం'. ఈ సినిమా ఆయనకే కాకుండా అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకం.
అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’కు ఆరేళ్ళు
ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు ఒకే సినిమాలో కలసి నటించడం అరుదైన విషయమనే చెప్పాలి. అలాంటి అరుదైన అంశానికి వేదికగా నిలిచిన చిత్రం ‘మనం’. అక్కినేని మూడు తరాల కథానాయకులైన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, ‘కింగ్’ నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మెమరబుల్ మూవీని విక్రమ్ కె.కుమార్ డైరెక్ట్ చేశాడు. నాగ్‌కి జోడిగా శ్రియాశరన్, చైతూకి జంటగా సమంత నటించిన ఈ సినిమాలో శరణ్య, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మానందం, సప్తగిరి, యం.యస్.నారాయణ, జయప్రకాష్ రెడ్డి, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, శంకర్ మేల్కోటే, కృష్ణుడు, గుండు సుదర్శన్ ముఖ్య భూమికలు పోషించగా.. అమల…