
ట్యాగ్ · 4 కథనాలు


'విజయ్ దేవరకొండ' తో నటించాలని ఉంది..!
మాళవిక మోహనన్ కిల్లింగ్ లుక్

నా ఓటు సలార్ కే అంటున్న మాస్టర్ బ్యూటీ
ప్రస్తుతం రిలీజ్ కు ఉన్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకోసం ఇండియన్ వైడ్ గా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి డిసెంబర్ నెలలో రిలీజ్ కాబోతుంది. ఇక ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబినేషన్ అంటే ప్రత్యేకంగా ప్రమోషన్స్ అక్కర్లేదు.. వీరి కాంబినేషన్స్ కే కావాల్సిన బజ్ వచ్చేస్తుంది. అయితే రిలీజ్ వరకూ ఆ బజ్ ఉండాలి కాబట్టి ప్రమోషన్స్ చేయాలి. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెడుతున్నారు.

'విజయ్ దేవరకొండ' తో నటించాలని ఉంది..!
పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ముఖ్యంగా తన ఆటిట్యూట్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస హిట్స్ సొంతం చేసుకొని ఇప్పుడు క్రేజీ హీరో అయ్యాడు. విజయ్ తో సినిమాలు చేయడానికి దర్శకులు ఇంట్రెస్ట్ చూపించే స్థాయికి ఎదిగాడు.

అభిమానులకు స్పెషల్ ట్రీట్ "మాస్టర్ " - మాళవిక మోహనన్
XB క్రియేటర్స్ బ్యానర్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , దళపతి విజయ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "మాస్టర్ " తమిళ మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. మాళవిక మోహనన్ కథానాయిక. విజయ్ సేతుపతి, అర్జున్ దాస్, ఆండ్రియా ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. "మాస్టర్ " మూవీ తమిళ భాషతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
మాళవిక మోహనన్ కిల్లింగ్ లుక్
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ "డాన్ ", "అంధా ధున్", టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ "మహర్షి ", పలు మలయాళ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన కె యు మోహనన్ తనయ మాళవిక "పట్టం పోలె "మలయాళ మూవీ తో సినీకెరీర్ ప్రారంభించారు. కన్నడ, తమిళ, మలయాళ మూవీస్ లో నటించారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందిన "మాస్టర్ " తమిళ మూవీ లో మాళవిక హీరోయిన్ గా నటించారు.