ట్యాగ్ · 43 కథనాలు · పేజీ 3
సరిలేరు నీకెవ్వరు షూటింగ్ షురూ

రేపటి నుంచి `సరిలేరు నీకెవ్వరు` షూటింగ్ ప్రారంభం?
సొంత ఫాం లో నమ్రత
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత ఎంత సింపుల్ గా ఉంటారో అందరికీ తెలుసు. స్టార్ హీరో భార్య అయినా కూడా చాలా సింపుల్ గా వుంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా కూడా నమ్రత ఎంతో యాక్టీవ్ గా ఉంటారు. మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి ఏదో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు.
సరిలేరు నీకెవ్వరు షూటింగ్ షురూ
మహర్షి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకు 'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ ను కూడా ఫిక్స్ చేసేశారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు ఈ సినిమాకు. అయితే తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. కాశ్మీర్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ఈరోజు ప్రారంభించారు.

రేపటి నుంచి `సరిలేరు నీకెవ్వరు` షూటింగ్ ప్రారంభం?
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు.