ట్యాగ్ · 43 కథనాలు · పేజీ 3

పరుశురాంతో మహేష్ సినిమా అంతా ఫేక్ న్యూసే..!
మహేష్ బాబుతో పరశురామ్ నెక్స్ట్ ఫిల్మ్ కన్ఫర్మ్
గత ఏడాది సంచలనం `గీత గోవిందం`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్నాడు దర్శకుడు పరశురామ్. ఏడాదికి పైగా విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్... తన నెక్స్ట్ వెంచర్ ని యువ సామ్రాట్ నాగచైతన్యతో చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 వేసవిలో పట్టాలెక్కనుంది.

పరుశురాంతో మహేష్ సినిమా అంతా ఫేక్ న్యూసే..!
రీసెంట్ గా మహర్షి సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తక్కువ గ్యాప్‌లో... రెండు చిత్రాలతో మహేష్ బాబు?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం `మహర్షి`ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ఈ సినిమా సెల్యులాయిడ్ పైకి రానుంది. ఆ తరువాత రెండు ఆసక్తికరమైన చిత్రాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు మహేష్. వాటిలో ఒకటి అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ కాగా... మరొకటి సుకుమార్ కాంబినేషన్ మూవీ. అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ జూలైలో ప్రారంభమై... 2020 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం. అలాగే సుకుమార్ దర్శకత్వం వహించనున్న సినిమా... జూలై నెలాఖరులో లేదా ఆగస్టు ప్రథమార్ధంలో ప్రారంభమై 2020 వేసవికి రిలీజ్ కానుందని తెలుస్తోంది.