ట్యాగ్ · 2 కథనాలు
ప్లాస్మా డొనేషన్ పై మహేష్ పిలుపు
లైన్ ప్రొడ్యూసర్ గోపీకృష్ణ కు మహేష్ బాబు అభినందనలు
టాలీవుడ్ లైన్ ప్రొడ్యూసర్ , ఫారిన్ షూట్ కో- ఆర్డినేటర్ గోపీకృష్ణ నర్రావుల కు సూపర్ స్టార్ మహేష్ బాబు అభినందనలు తెలిపారు. "బజార్ రౌడీ "(1988 ) మూవీ తో లైన్ ప్రొడ్యూసర్ గా మారిన గోపికృష్ణ మహేష్ బాబు నటించిన అనేక సూపర్ హిట్ మూవీస్ కు పని చేశారు . చిరంజీవి (సైరా నరసింహా రెడ్డి ), పవన్ కళ్యాణ్ (గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది ), ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో ), ప్రభాస్ (మిర్చి ) మూవీస్ కు వర్క్ చేశారు.
ప్లాస్మా డొనేషన్ పై మహేష్ పిలుపు
కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకురావాలని సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా మద్దతు పలుకుతూ వారు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన చేపడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేసి ఇతరుల ప్రాణాలను రక్షించాలని మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సెలబ్రిటీస్ ఇప్పటికే స్పందించి ప్లాస్మా డొనేషన్ చేయాలని కోరారు. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ కూడా ప్లాస్మా డొనేషన్ పై పిలుపనిచ్చారు.