
ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2


దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' షూటింగ్ ప్రారంభం

దుల్కర్-వెంకీ అట్లూరి మూవీకి ఇట్రెస్టింగ్ టైటిల్

లక్కీ భాస్కర్ టీజర్ రిలీజ్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ కూడా తెలుగులో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' షూటింగ్ ప్రారంభం
‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న మరియు విజయవంతమైన పాన్-ఇండియా నటులలో ఆయన ఒకరు. కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపుతూ, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నత శిఖరాలకి చేరుకుంటున్నారు. ఇటీవలే అభిలాష్ జోషి దర్శకత్వంలో 'కింగ్ ఆప్ కోత' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్ తాజాగా తెలుగులో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. 'సీతారామం' తర్వాత, ఆయన టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం 'లక్కీ భాస్కర్'ను ప్రకటించారు.

దుల్కర్-వెంకీ అట్లూరి మూవీకి ఇట్రెస్టింగ్ టైటిల్
తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడమే కాదు.. ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మన తెలుగు దర్శకుల టాలెంట్ కు ఫిదా అవుతున్న కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. దానికి రుజువు చేస్తూ హను రాఘవపూడితో దుల్కర్ చేసిన సీతారామం, అలానే ధనుష్ చేసిన సార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. సీతారామం సినిమా అయితే క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మరో తెలుగు సినిమాను చేయడానికి రెడీ అయిపోయాడు దుల్కర్.