కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Lucifer Movie Telugu Remake

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

"లూసిఫర్"రీమేక్ లో నయనతార ?

సూపర్ స్టార్ మోహన్ లాల్ , మంజు వారియర్ ప్రధానపాత్రలలో, పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ “లూసిఫర్” మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో మంజు వారియర్ ఒక గ్రేట్ పొలిటీషియన్ కుమార్తె గా , బాధ్యత గల మహిళగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.ఆమె కు సపోర్ట్ గా నిలిచిన మోహన్ లాల్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “లూసిఫర్” మలయాళ మూవీ తెలుగు రీమేక్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనుంది. మలయాళ మూవీ లో నటించిన మంజు వారియర్ పాత్రకు నయనతార ను సెలెక్ట్ చేసినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'లూసిఫర్' రీమేక్ కు డైరెక్టర్ ఫిక్స్

మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. మొదట వినాయక్ అన్నారు. ఆ తర్వాత వినాయక్ తప్పుకున్నాడని.. ఆ తర్వాత రీమేక్ భాద్యతలు సాహో డైరెక్టర్ సుజీత్ కు అప్పచెప్పినట్టు.. సుజీత్ కూడా కథ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడని అన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ సుజీత్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు ఈమధ్య వార్తలు వినిపించాయి.

TFN Adminవాట్సాప్

షేర్