
ట్యాగ్ · 2 కథనాలు


శివాజీ-లయ హిట్ కాంబినేషన్ రిపీట్
ప్రముఖ నటుడు శివాజీ మళ్ళీ సినిమాలలో బిజీ అవుతున్నారు. గత బిగ్ బాస్ సీజన్ 7లో ప్రధాన కంటెస్టెంట్‍గా శివాజీ మంచి గుర్తింపు సాధించాడు. అనంతరం ఆయన ప్రధానపాత్రలో నటించిన '90's' వెబ్ సిరీస్‌లో నటించి హిట్ అందుకున్నారు. తాజాగా ఆయన, ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ హీరోహీరోయిన్లుగా ఓ సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటోంది. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.2గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి నిర్మాత కూడా శివాజీ కావడం గమనార్హం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సీనియర్ హీరోయిన్ లయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
భద్రం కొడుకో (1992 ) మూవీలో బాలనటి గా టాలీవుడ్ కు పరిచయం అయిన లయ, స్వయంవరం(1999 ) మూవీతో కథానాయికగా మారారు. మనోహరం, మనసున్న మారాజు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, ప్రేమించు, శివరామరాజు వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం అభినయంతో లయ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కన్నడ, తమిళ, మలయాళ భాషల కొన్ని సినిమాలలో లయ నటించారు. సినిమాల్లో బిజీగా ఉండగానే లయ పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు. వివాహనంతరం నటనకు దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ.. తెలుగు సూపర్ హిట్ సాంగ్స్‌కు తనదైన స్టైల్‌లో డ్యాన్సు చేస్తూ ఆ వీడియోస్ ను షేర్ చేస్తున్నారు.