
ట్యాగ్ · 62 కథనాలు · పేజీ 4

'101 జిల్లాల అందగాడు' సాంగ్ ప్రోమో రిలీజ్
విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్ హీరోగా 101 జిల్లాల అందగాడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా ఫస్ట్ లుక్ ను చాలా డ్రామా క్రియేట్ చేసే రిలీజ్ చేశాడు అవసరాల శ్రీనివాస్. ఇక ఫస్ట్ లుక్ కు చాలామంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈ చిత్రంలోనే అవసరాల శ్రీనివాస్ బట్టతలతో గొత్తి సూర్యనారాయణ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి '101 జిల్లాల అందగాడు' సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.

టక్ జగదీష్ - 'ఇంకోసారి ఇంకోసారి' ఫస్ట్ లిరికల్ రిలీజ్
స్పెషల్ డేస్ లో మూవీస్ నుండి అప్ డేట్స్ రావడం కామన్. ఇక రేపు వాలెంటైన్స్ డే సందర్భంగా చాలా సినిమాల నుండి వరుస పెట్టి సినిమాలు రానున్నాయి. ఇక టక్ జగదీష్ నుండి ఒక రోజు ముందే అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుండి ఈ రోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తామని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. చెప్పినట్టే ఈ రోజు 'ఇంకోసారి ఇంకోసారి' అనే మెలోడీ పాటను రిలీజ్ చేశారు. లిరికల్ పాటను మాత్రమే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. గుమ్మడి వరలక్ష్మి.. గుమ్మ.. ఏ నచ్చలేదా? అంటూ నాని అడిగిన ప్రశ్న... దానికి రీతూ వర్మ నచ్చింది అంటూ చెప్పడం.. థమన్ సంగీతం.. శ్రేయా ఘోషల్, కాల భైరవ గాత్రం.. అన్నీ ఆకట్టుకుంటున్నాయి.