
ట్యాగ్ · 86 కథనాలు · పేజీ 5


ఢిల్లీ లో పెద్ది షూటింగ్

మా వందే షూటింగ్ షురూ

సంక్రాంతి సినిమాలు … రోజుకో రిలీజ్

టాక్సిక్ నుండి కియారా పోస్టర్ రిలీజ్
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ నుండి ఒక క్రేజీ అప్‌డేట్ వెలువడింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె 'నదియా' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఢిల్లీ లో పెద్ది షూటింగ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెద్ది షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ఆయనపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో రామ్ చరణ్ 'రా' అండ్ 'రస్టిక్' మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.

ఛాంపియన్ తో 100% హిట్ కొడుతున్నాం: ఛాంపియన్ నైట్ ఈవెంట్ లో హీరో రోషన్
స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ 'ఛాంపియన్' అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా ఛాంపియన్ నైట్ ఈవెంట్ నిర్వహించారు.

ఈషా అందరి అంచనాలను అందుకుంటుంది - బన్నీవాస్, వంశీ నందిపాటి
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో ఓహారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ…

మా వందే షూటింగ్ షురూ
భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా బయోపిక్ రానున్న విషయం తెలిసిందే. మోదీ జన్మదినం సందర్భంగా ఈసినిమాను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈరోజు పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలు పెట్టారు.మా వందే అనే టైటిల్ తో ఈ బయోపిక్ తెరకెక్కుతుండగా మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఇందులో మోదీ పాత్రలో నటిస్తున్నాడు.ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది. క్రాంతి కుమార్ డైరెక్ట్ చేస్తుండగా ఈసినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

సంక్రాంతి సినిమాలు … రోజుకో రిలీజ్
సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కి ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీస్ అన్ని థియేటర్లలకు కదిలే పండుగ ఇది.అందుకే ఈ సీజన్ లో ఎక్కువ సినిమాలు రిలీజవుతుంటాయి. గత సంక్రాతికి సంక్రాంతి వస్తున్నాం వచ్చి కలెక్టన్ల వర్షం కురిపించింది.ఇక ఈ సంక్రాంతికి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరుకు సిద్ధమైంది. అగ్ర హీరోల నుండి యంగ్ స్టార్ల వరకు ప్రతిరోజూ ఒక పెద్ద సినిమా విడుదలకు ప్లాన్ చేస్తుండటంతో, థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొననుంది. జనవరి 12నుండి 15వరకు రోజుకో సినిమా లెక్కన బరిలోకి దిగనున్నాయి.