
ట్యాగ్ · 2 కథనాలు


'కొండపొలం' బుల్లి తెరపై కూడా సూపర్ రెస్పాన్స్

రవితేజ ‘రావణాసుర ప్రారంభం.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్..!
రవితేజ మాత్రం తన స్పీడును అస్సలు తగ్గించట్లేదు. ఒక సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే రవితేజ లిస్ట్ లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అయినా కూడా కొత్త కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం 'ఖిలాడి' చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకోగా 'రామారావు ఆన్ డ్యూటీ' షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా వంశీ అనే డైరెక్టర్ తో టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.

'కొండపొలం' బుల్లి తెరపై కూడా సూపర్ రెస్పాన్స్
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం కొండపొలం. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు క్రిష్. ఇక ఈసినిమా అక్టోబర్లో థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయితే ఓటీటీ నుండి కూడా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాను చూసిన ఆడియన్స్ తమ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.