
ట్యాగ్ · 2 కథనాలు

"ఆదిపురుష్" లో సీత

కృతి సనన్ తెలుగు పాఠాలు
“1:నేనొక్కడినే ” మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఆదిపురుష్ “మూవీలో కృతి సీత క్యారెక్టర్ కై ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా కృతి మాట్లాడుతూ .. సీత పాత్ర లో నటించడం పెద్ద బాధ్యత అనీ , "ఆదిపురుష్ "మూవీ లో తనను కథానాయికగా ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందనీ చెప్పారు.
"ఆదిపురుష్" లో సీత
టి -సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పౌరాణిక నేపథ్యం లో 3డి ఫార్మాట్ లో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న "ఆదిపురుష్ "మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడు గా నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న "ఆదిపురుష్ "మూవీ లో సీతగా కృతి సనన్ ఎంపిక అయ్యారు .