
ట్యాగ్ · 2 కథనాలు

'రాధే శ్యామ్' లో నా పాత్ర అదే

కృష్ణంరాజు మనసులో మాట
"చిలకా గోరింకా "(1966 ) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన కృష్ణంరాజు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ నెలకొల్పి పలు సూపర్ హిట్ మూవీస్ ను నిర్మించారు. సుమారు 190 సినిమాలలో నటించిన కృష్ణంరాజు బెస్ట్ యాక్టర్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. కృష్ణం రాజు సినీకెరీర్ లో "కృష్ణవేణి ", "భక్తకన్నప్ప", అమరదీపం ", "రంగూన్ రౌడీ ", "మనవూరి పాండవులు ", "బొబ్బిలి బ్రహ్మన్న ", "బావ బావమరిది " వంటి మూవీస్ ఆణిముత్యాలు గా నిలిచాయి.
'రాధే శ్యామ్' లో నా పాత్ర అదే
జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పూజా హెగ్డే తన షూట్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ టైటిల్ పోస్టర్ ను, పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.