
ట్యాగ్ · 3 కథనాలు


'SR కళ్యాణమండపం' ట్రైలర్ రిలీజ్

'SR కళ్యాణమండపం' రిలీజ్ డేట్ ఫిక్స్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'SR కళ్యాణమండపం'
రాజావారు రాణిగారు సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. శ్రీధర్ గాదే దర్శకత్వంలో ప్రస్తుతం ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఈసినిమా ఆగష్ట్ 6న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా చేస్తుంది చిత్రయూనిట్. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈసినిమా.. ఇప్పుడు తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

'SR కళ్యాణమండపం' ట్రైలర్ రిలీజ్
'రాజావారు రాణివారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం లీడ్ రోల్‌లో రాబోతున్న సినిమా 'SR కళ్యాణమండపం'. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగస్టు 6వ తేదీన ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్. దీనిలోభాగంగానే ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో నేడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

'SR కళ్యాణమండపం' రిలీజ్ డేట్ ఫిక్స్
నూతన దర్శకుడు శ్రీధర్ గాదే దర్శకత్వంలో రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ జంటగా వస్తున్న సినిమా SR కళ్యాణమండపం EST 1975. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్ రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈఏడాది మేలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలో రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు SR కళ్యాణమండపం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల…