
ట్యాగ్ · 2 కథనాలు


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా కియారా అద్వానీ?

అహంకారిని కాదు- కియారా అద్వానీ
బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కియారా అద్వానీ , ఆమూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “వినయవిధేయ రామ ” మూవీ తరువాత కియారా తెలుగు మూవీస్ లో నటించలేదు. సూపర్ హిట్”అర్జున్ రెడ్డి ” హిందీ రీమేక్ “కబీర్ సింగ్ ” మూవీ ఘనవిజయం సాధించడంతో కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీగా మారారు. కియారా ప్రస్తుతం “భూల్ భులయ్యా 2”, జుగ్ జుగ్ జియో “,”Mr లేలే ” మూవీస్ లో నటిస్తున్నారు. భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందనున్న "#RC15 మూవీ లో కియారా కథానాయికగా ఎంపిక అయ్యారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా కియారా అద్వానీ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ ను తెరకెక్కించే సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొరటాల , ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన "జనతా గ్యారేజ్ "మూవీ ఘనవిజయం సాధించింది.