
ట్యాగ్ · 2 కథనాలు

షూటింగ్స్ కు సిద్ధంగా లేను - కీర్తి సురేష్

ట్యాలెంటే ముఖ్యం
తెలుగు ,తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు మూవీస్ లో బిజీగా ఉన్న కీర్తి లాక్ డౌన్ సమయంలో యోగా , వయోలిన్ ప్రాక్టీస్ , సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ , తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో బంధుప్రీతి, ఆధిపత్య ధోరణి వల్లే హీరో సుశాంత్ సింగ్ బలవన్మరణానికి పాల్పడ్డారని పలువురు సినీ ప్రముఖులు ఆరోపించిన నేపథ్యంలో కీర్తి స్పందించారు.
షూటింగ్స్ కు సిద్ధంగా లేను - కీర్తి సురేష్
సక్సెస్ ఫుల్ "నేను శైలజ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ స్వంతం చేసుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ భాషలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి నటించిన "మిస్ ఇండియా "(తెలుగు ), "మరక్కార్ "(మలయాళ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. "గుడ్ లక్ సఖి ", "రంగ్ దే ", "అన్నాత్తే (తమిళ ) మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి.