
ట్యాగ్ · 3 కథనాలు

మెరిసిపోతున్న "మహానటి "

షూటింగ్‌కి ముస్తాబవుతున్న కీర్తి సురేష్

మార్చిలో కీర్తి సురేష్ డబుల్ ధమాకా
2018లో `మహానటి`గా మురిపించిన కేరళకుట్టి కీర్తి సురేష్.. గత ఏడాది `మన్మథుడు 2`లో అతిథి పాత్రకే పరిమితమైంది. అయితే, 2020లో మాత్రం వరుస చిత్రాలతో సందడి చేయనుంది. దాదాపు అరడజను సినిమాలతో ఈ టాలెంటెడ్ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై ఎంటర్ టైన్ చేయనుంది. అంతేకాదు.. ఒక్క మార్చి నెలలోనే రెండు చిత్రాలతో మురిపించనుంది.
మెరిసిపోతున్న "మహానటి "
సూపర్ హిట్ మూవీ "నేను శైలజ " తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కీర్తి సురేష్ నటించిన "నేను లోకల్ " మూవీ ఘనవిజయం సాధించింది. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ "మహానటి "లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ ఉత్తమనటిగా జాతీయ అవార్డ్ అందుకుని టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ ను పెంపొందించుకున్నారు.

షూటింగ్‌కి ముస్తాబవుతున్న కీర్తి సురేష్
`మహానటి`తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కేరళ కుట్టి కీర్తి సురేష్. అభినేత్రి సావిత్రి పాత్రలో కీర్తి ఒదిగిపోయిన తీరుకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సుదీర్ఘ విరామం తరువాత... మరో తెలుగు చిత్రానికి సంతకం చేసింది కీర్తి. నూతన దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. కాగా... రెగ్యులర్ షూటింగ్‌ని ఈ నెల 10 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో చిత్రీకరణను మొదలుపెట్టి... అనంతరం కేరళలో షూటింగ్ జరపడానికి యూనిట్ ప్లాన్ చేస్తోంది.