
ట్యాగ్ · 3 కథనాలు


"సర్కారు వారి పాట " లో కీర్తి సురేష్ వయొలిన్ స్కిల్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'సర్కారు వారి పాట' కళావతి గా కీర్తిసురేష్
పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇక నిన్న కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి వచ్చిన అప్ డేట్స్ ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ముందు ఈసినిమా నుండి చిన్న టీజర్ ను రిలీజ్ చేయగా అందులో మహేష్ మేకోవర్, మహేష్ యాక్షన్ ను చూసి అందరూ ఫిదా అయిపోయారు. మళ్లీ పాత మహేష్ ను చూస్తున్నట్టే ఉంది అని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మహేష్ బాబు అందం గురించి కూడా స్పెషల్ గా డైలాగ్స్ రాసినట్టు ఉన్నారు. సార్ ప్రతీ రోజూ పడుకునే ముందు దిష్టి తీయడం మరిచిపోకండి అని ఏకంగా హీరోయిన్ తో డైలాగ్ చెప్పించారు.

'సర్కారు వారి పాట'.. మహేష్ ఫ్యాన్స్ కు కీర్తి కామెడీ ట్రీట్
పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి ఏదో ఒక అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాగ్జిమమ్ ఫస్ట్ లుక్ నే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.