
ట్యాగ్ · 2 కథనాలు

ఇన్ స్టా గ్రామ్ లో 5 మిలియన్ ఫాలోవర్స్

"అన్నాత్తే " మూవీ విశేషాలు
టాలీవుడ్ , కోలీవుడ్ లలో సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి తెలుగు , తమిళ , మలయాళ భాష చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో కూడా కీర్తి నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ కీర్తి అభిమానులను అలరిస్తున్నారు. పలు కొత్త మూవీస్ ఆఫర్స్ అందుకుంటున్నారు.
ఇన్ స్టా గ్రామ్ లో 5 మిలియన్ ఫాలోవర్స్
తెలుగు, తమిళ , మలయాళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫామ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. పలు చిత్రాలలో నటిస్తూ కీర్తి సురేష్ బిజీ గా ఉన్నారు. తెలుగు లో "గుడ్ లక్ సఖి ", "రంగ్ దే " మూవీస్ లో నటిస్తున్న కీర్తి సురేష్ తమిళ భాషలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న "అన్నాత్తే " మూవీ లో నటిస్తున్నారు . కీర్తి నటించిన "మిస్ ఇండియా "(తెలుగు ), "మరక్కార్ "(మలయాళం ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.