
సినిమా వార్తలు
ట్యాగ్ · 2 కథనాలు


బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న హీరో కార్తికేయ నటించిన కొన్ని సినిమాలు నిరాశ పరిచినా కొత్త మూవీ ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. హీరో గానే కాకుండా ప్రతినాయకుడిగా కూడా కార్తికేయ నటిస్తున్నారు. ఒక నూతన దర్శకుడు రూపొందించనున్న మూవీ కి కార్తికేయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బ్లాక్ బస్టర్ "RX 100 "మూవీ లో హీరోగా నటించి యూత్ లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న కార్తికేయ నటించిన "హిప్పీ ", "గుణ 369 " మూవీస్ నిరాశ పరిచాయి. హీరో కార్తికేయ మోడరన్ దేవదాసు గా నటించిన 90ML మూవీ నిన్న రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన పొందింది. మూవీస్ ఫలితాలు ఎలా ఉన్నా కార్తికేయ కు యూత్ లో ఉన్న క్రేజ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు.