ట్యాగ్ · 2 కథనాలు
`కార్తికేయ` సీక్వెల్ లో టీవీ రిపోర్టర్ గా స్వాతి?
2014 నాటి డివోషనల్ థ్రిల్లర్ `కార్తికేయ`కి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో కథానాయకుడిగా నటించిన నిఖిల్ ఇందులోనూ హీరోగా నటిస్తున్నాడు. అలాగే `కార్తికేయ`కి దర్శకత్వం వహించిన చందు మొండేటినే ఈ సీక్వెల్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు.. అందులో నాయికగా నటించిన స్వాతి కూడా ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమిస్తుందట. వినిపిస్తున్న కథనాల ప్రకారం... ఇందులో స్వాతి టీవీ రిపోర్టర్ రోల్ లో కనిపిస్తుందని, కథను కీలక మలుపు తిప్పే పాత్ర ఇదని తెలిసింది. మరి... టీవీ రిపోర్టర్ పాత్రలో స్వాతి ఏ స్థాయిలో రంజింపజేస్తుందో చూడాలి.
జనవరిలో పట్టాలెక్కనున్న `కార్తికేయ` సీక్వెల్
యువ కథానాయకుడు నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచిన చిత్రం `కార్తికేయ` (2014). ఈ సినిమాతోనే చందు మొండేటి దర్శకుడిగా పరిచయమయ్యాడు. కట్ చేస్తే... ఐదేళ్ళ తరువాత ఈ డివోషనల్ థ్రిల్లర్ కి సీక్వెల్ ప్లానింగ్ జరుగుతోంది. `కార్తికేయ` కథ ఎక్కడ ముగిసిందో... అక్కడి నుంచే `కార్తికేయ 2` ప్రారంభం అవుతుందట.