
ట్యాగ్ · 2 కథనాలు


కాంతార2 మూవీ అప్ డేట్

కాంతార 2 లాంచింగ్ డేట్ ఫిక్స్
ఈమధ్య కన్నడ సినిమాలు కూడా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్నాయి. కె.జి.యఫ్ తరువాత ఆ రేంజ్ లో ఈమధ్య కాలంలో సంచలనం సృష్టించిన సినిమా కాంతార. రిషబ్ శెట్టి దర్శకత్వంలో చాలా సహజంగా అడవి, అడవిలోని మనుషుల జీవనం, వారి సెంటిమెంట్, దైవం, అమాయకజనాన్ని మోసం చేయడం అనే అంశాలపై ఈసినిమా తెరకెక్కింది. చిన్న సినిమాగా కన్నడలో రిలీజ్ అయింది కాంతార. అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో హిందీలో కూడా రిలీజ్ చేశారు. హిందీలో కూడా ఈసినిమా సూపర్ హిట్ అయింది.

కాంతార2 మూవీ అప్ డేట్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ అద్భుత రెస్పాన్స్ సాధించిన విషయం తెలిసిందే. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.కాంతార మూవీ కి ఓటీటీ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.