
ట్యాగ్ · 2 కథనాలు


"తలైవి " న్యూ లుక్

తలైవి కోసం 20కిలోలు పెరిగా
ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ రాగా రీసెంట్ గానే తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో జయలలిత బాల్యం నుండి సీఎం అయ్యేవరకూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది లాంటి అన్ని విషయాలను చూపించనున్నారు.

"తలైవి " న్యూ లుక్
లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ , తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తమిళ , తెలుగు , హిందీ భాషలలో "తలైవి " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందిస్తున్నారు.