
ట్యాగ్ · 2 కథనాలు

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' - 'పప్పు లాంటి అబ్బాయి' సాంగ్ టీజర్ రిలీజ్
టైటిల్ తోనే తన సినిమాలకు ఎక్కడా లేని క్రేజ్ ను తీసుకొచ్చే వర్మ.. ఈసారి ఏకంగా రెండు వర్గాల పేర్లనే టైటిల్ గా తీసుకొని 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అన్న సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వర్మ ప్రమోషన్స్ ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టీజర్, ట్రైలర్, పాటలతోనే సగం సినిమాకు క్రేజ్ తీసుకొస్తాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను రిలీజ్ చేసి... డైరెక్ట్ గా పలు రాజకీయ నేతలపైనే సెటైర్లు వేసాడు. ఇప్పుడు తాజాగా మరో పాటతో రెడీ అయ్యాడు. తాజాగా ఈ సినిమా నుండి 'పప్పు లాంటి అబ్బాయి' సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసి షాకిచ్చాడు. మరి ఈ పాట ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూద్దాం..

కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ మూడవ సాంగ్ రిలీజ్
రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి వివాస్పద చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాస్పద చిత్రం కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అజయ్ మైసూర్ సమర్పణ లో టైగర్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆర్ జి వి దర్శకత్వంలో రూపొందుతున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ లోని 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి . ఆ రెండు సాంగ్స్ లో ఒక సాంగ్ వర్మ గానం చేయడం విశేషం.