
ట్యాగ్ · 4 కథనాలు


మల్టీస్టారర్ సినిమా కోసం పాండిచ్చేరి కి సామ్

'కాతు వాకుల రెండు కాదల్' ట్రైలర్ రిలీజ్..!
విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ స్టార్ హీరోయన్ సమంత, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయతార లీడ్ రోల్స్ లో వస్తున్న సినిమా చిత్రం కాతువాకుల రెండు కాదల్. ముగ్గురు స్టార్ లతో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఇక తెలుగులో ఖణ్మణి రాంబో ఖతీజా అనే టైటిల్ తో ఈసినిమా రిలీజ్ కానుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా కరోనా వల్ల ఎన్నో బ్రేకులు పడ్డాయి. ఫైనల్ గా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా…

ఏప్రిల్ లో 'కాతు వాకుల రెండు కాదల్' .. టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార ప్రధానపాత్రల్లో వస్తున్న సినిమా కాతు వాకుల రెండు కాదల్. ఇక ఈసినిమా షూటింగ్ కు కూడా కరోనా వల్ల చాలా బ్రేకులు పడగా.. మొత్తానికి షూటింగ్ ను అయితే పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది కూడా. అప్పుడప్పుడు పలు పోస్టర్లు రిలీజ్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. గతంలో ఈసినిమాను వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ అది కుదరలేదు.

'కాతు వాకుల రెండు కాదల్' సమంత ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏమాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక అప్పటి నుండి ఇప్పటివరకూ సమంత కెరీర్ లో వెనుతిరిగి చూసుకోలేదు. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా సమంతకు కెరీర్ పరంగా మాత్రం ఏలాంటి ఇబ్బందులు కలగలేదు. ప్రస్తుతం అయితే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ పాత్ర ప్రధానమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. కేవలం సినిమాలే కాకుండా డిజిటల్ మీడియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

మల్టీస్టారర్ సినిమా కోసం పాండిచ్చేరి కి సామ్
స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. సినిమాలు, షోలు, వెబ్ సిరీస్ లు ఇలా అన్నింటిలోనూ తన మార్క్ ను చూపిస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం చాలా సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ఇప్పటికే తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తుంది. ఈసినిమా షూటింగ్ కూడా ఇటీవల పూర్తి చేసుకుంది సమంత. పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు.