
ట్యాగ్ · 4 కథనాలు

మరోసారి తారక రాముడి సమేతంగా త్రివిక్రముడు?

ఫిట్ నెస్ ట్రైనింగ్ లో ఎన్టీఆర్
జూలై 9... తాత మనవళ్ళ ఇండస్ట్రీ హిట్స్

నందమూరి అభిమానులకు శుభవార్త ?
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో తారాపథం లో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ RRR మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం మార్చి నెలలో RRR మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది. ఆ మూవీ తరువాత తాను నటించే మూవీస్ కు ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.
మరోసారి తారక రాముడి సమేతంగా త్రివిక్రముడు?
యంగ్ టైగర్ యన్టీఆర్‌ని కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రాలలో `అరవింద సమేత వీర రాఘవ` ఒకటి. గత ఏడాది విజయదశమి కానుకగా విడుదలైన ఈ సినిమాకి ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించిన ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుందని సమాచారం.

ఫిట్ నెస్ ట్రైనింగ్ లో ఎన్టీఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ RRR భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తెలంగాణ ట్రైబల్ హీరో కొమరం భీమ్ గా, రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఒక కథానాయిక. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. RRR మూవీ 2020 జులై 30 వ తేదీ రిలీజ్ కానుంది.
జూలై 9... తాత మనవళ్ళ ఇండస్ట్రీ హిట్స్
జూలై 9... నందమూరి కుటుంబానికి కలిసొచ్చిన తేదీల్లో ఒకటి. ఎందుకంటే... ఇదే రోజున ఆ కుటుంబం నుంచి రెండు వేర్వేరు తరాల కథానాయకులు నటించిన శక్తిమంతమైన చిత్రాలు విడుదలై ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. ఆ ఇద్దరి హీరోల్లో ఒకరు మహానటుడు యన్.టి.రామారావు కాగా... మరొకరు ఆయన మనవడు యంగ్ టైగర్ యన్టీఆర్. ఆ చిత్రాలే `బొబ్బిలిపులి`, `సింహాద్రి`.