
ట్యాగ్ · 2 కథనాలు


స్టైలిష్ ఎన్నారై పాత్రలో ఎన్టీఆర్ ?

'ఎన్టీఆర్ 30' క్లారిటీ వచ్చేసింది - కొరటాలతో కన్ఫామ్
ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మాత్రం గత కొద్దిరోజులుగా చాలా కన్ఫ్యూజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కే రెండేళ్లకు పైగా టైమ్ పట్టింది. ఇక ఎలాగొలా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది కాబట్టి ఇప్పుడు ఫోకస్ మొత్తం ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పడింది.

స్టైలిష్ ఎన్నారై పాత్రలో ఎన్టీఆర్ ?
వరుస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ మూవీ కై భారీ అంచనాలతో ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న "#NTR30 " మూవీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.