
ట్యాగ్ · 2 కథనాలు


బుల్లితెరపై సందడికి రెడీ అవుతున్న ఎన్టీఆర్..!

'ఎవరు మీలో కోటీశ్వరులు' షూటింగ్ స్టార్ట్
బిగ్ బాస్' షోతో బుల్లితెరపై అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ గేమ్ షో ద్వారా మరోసారి అలరించడానికి రెడీ అయ్యాడు. ఈ మేరకు జెమినీ టీవీతో ఒప్పందం కుదుర్చుకున్న తారక్.. ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాడు. మరికొన్ని రోజుల్లో షో ప్రసారం అవుతుందని అనుకోగా.. కరోనా సెకండ్ వేవ్ వచ్చి బ్రేక్స్ వేసింది. ఈ నేపథ్యంలో ఈ షో జరగకపోవచ్చన్న రూమర్స్ కూడా వచ్చాయి. అయితే అందులో ఎంతమాత్రం నిజంలేదని తేలిపోయింది. జులై నుండి ఈ షో షూటింగ్ స్టార్ట్ అవుతుందని కూడా అన్నారు.

బుల్లితెరపై సందడికి రెడీ అవుతున్న ఎన్టీఆర్..!
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న పోర్షన్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఇక మరికొద్దిరోజుల్లో ఈసినిమా షూటింగ్ పూర్తికానుంది. ఈసినిమా తరువాత రెండు సినిమాలు చేయనున్నాడు. ఇప్పటికే ఆ రెండు కూడా అధికారిక ప్రకటన వచ్చేశాయి. అందులో మొదటిది కొరటాల శివ దర్శకత్వంలో ఒకటి.. మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొకటి.