
ట్యాగ్ · 3 కథనాలు


తెలుగు మూవీ హిందీ రీమేక్ లో జాన్వీ కపూర్ ?
యన్టీఆర్‌తో జాన్వీ కపూర్?

"హెలెన్ " మూవీ హిందీ రీమేక్ లో జాన్వీ కపూర్
లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సూపర్ హిట్ "ధడక్ " మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. జాన్వీ కపూర్ నటించిన "గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ ", "రూహి అఫ్జానా" మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కార్తీక్ ఆర్యన్ , జాన్వీ కపూర్ జంటగా "దోస్తానా 2 " మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. మలయాళ హిట్ మూవీ "హెలెన్ " హిందీ రీమేక్ లో నటించాలని ఉందని జాన్వీ కపూర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పడు జాన్వీ కపూర్ కోరిక నెరవేరింది.

తెలుగు మూవీ హిందీ రీమేక్ లో జాన్వీ కపూర్ ?
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .." మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సంగీత దర్శకుడు థమన్ స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు "అల .. వైకుంఠపురములో .." మూవీ హిందీ భాషలో రీమేక్ కానుంది. ఈ మూవీ లో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
యన్టీఆర్‌తో జాన్వీ కపూర్?
`అరవింద సమేత` వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న విషయం విదితమే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.