ట్యాగ్ · 2 కథనాలు
వదర బాధితుల కోసం 1 కోటి 50 లక్షలు విరాళం
ఒకపక్క కరోనా వల్ల ఇప్పటికే ప్రజలు పలు ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క భారీ వర్షాలు ప్రజలకు పెద్ద సమస్యగా మారాయి. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలోని ఎన్నో ప్రాంతాలు నీట మునిగి లక్షలాదిమంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇక కేసీఆర్ పిలుపు మేరకు తెలుగు ఇండస్ట్రీ అంతా కదలివచ్చింది. మన తెలుగు హీరోలు అందరూ ముందుకొచ్చి తమకు తోచినంత సాయం చేశారు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో మన బాహుబలి కూడా చేరిపోయాడు.
వరద భాదితుల కోసం ముందుకొచ్చిన 'తెలుగు సినీ ప్రముఖులు'
కరోనా వల్ల ఇప్పటికే ప్రపంచం అతలాకుతలమైపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త సాధారణ పరిస్థితులు వస్తున్నాయి కదా అని అనుకునేలోపు మళ్లీ మరో సమస్య వచ్చి పడింది. అది కూడా తెలుగు రాష్ట్రాలకు. ఏపీలో కాస్త బెటరే కానీ.. భారీ వర్షాలతో భాగ్యనగరం వణికిపోతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇక ఏ ఆపద వచ్చినా మన సినీ ప్రముఖులు ఎప్పుడు ముందుంటారు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా నేపథ్యంలో మన సెలబ్రిటీస్ అందరూ ముందుకు వచ్చి తమ వంతు సాయం చేయగా ఇప్పుడు వరదలతో చిక్కుల్లో పడ్డ హైద్రాబాద్ వాసులకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పటికే వారిని ఆదుకునేందుకు…