ట్యాగ్ · 4 కథనాలు

లేడీ గెటప్ లో విలక్షణ నటుడు 'ఉపేంద్ర'

నేను సీఎం కావాలి.. చేస్తారా..?
కొత్తవాళ్లు బన్నీ ని చూసి చాలా నేర్చుకోవాలి..!
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కోసం తను ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో ఇప్పటికే చూశాం. అంతేకాదు బన్నీ హార్డ్ వర్క్ గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పిన సెలబ్రిటీలు కూడా ఎంతోమంది ఉన్నారు. కెరీర్ స్టార్టింగ్ నుండి తనను తాను కొత్తగా మలుచుకుంటూ పాత్రల్లో విభిన్నత ఉండేలా చూసుకుంటూ అంచలంచలుగా స్టార్ హీరో వరకూ ఎదిగాడు. ఇక ఇప్పుడు బన్నీ పై ఓ విలక్షణ నటుడు కూడా ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఆ విలక్షణ నటుడు ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.

చిరంజీవి గారిని డైరెక్ట్ చేయలేకపోయా.. ఆ బాధ ఇంకా ఉంది..!
మెగాస్టార్ చిరంజీవి.. సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో మందికి స్పూర్తిదాయకమైన పేరు. కేవలం చిరును చూసే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. హీరోలు, టెక్నీషియన్స్, డైరెక్టర్లు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. ఇప్పుడున్న యంగ్ హీరోస్ కూడా ఎంతో మంది చిరు ఇన్ఫిరేషన్ తో వచ్చిన వాళ్లే. మరి అలాంటి చిరంజీవితో సినిమా చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. అయితే ఆ అదృష్టం అనేది మాత్రం కొంత మందికే దక్కుతుంది. అలాంటి అదృష్టమే ఓ విలక్షణ నటుడికి వచ్చినా ఆ అవకాశం చేజారిపోయిందట.. చిరుతో సినిమా చేయనందుకు ఇప్పటికీ బాధ ఉంది అంటున్నాడు. మరి ఆ విలక్షణ నటుడు ఎవరనుకుంటున్నారా.. మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో…

లేడీ గెటప్ లో విలక్షణ నటుడు 'ఉపేంద్ర'
విభిన్నమైన సినిమాలతో.. డిఫరెంట్ రోల్స్ తో ఆడియన్స్ ను ఎప్పుడూ సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటాడు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. ఇక ఇప్పుడు కూడా అలాంటి డిఫరెంట్ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలో తను తాజాగా తన ట్విట్టర్ ద్వారా ఒక ఫొటో షేర్ చేయగా మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు ఉపేంద్ర. ఒక అమ్మాయి ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్డడమే కాదు ఆ ఫొటో ను షేర్ చేశారు. ఆ ఫొటోలో ఉన్నది ఎవరో కాదు ఉపేంద్రనే. ఆయన లేడీ గెటప్ ధరించి ఆ ఫొటో దిగారని స్పష్టమవుతోంది. తన సినిమాలో ఓ పాత్ర కోసం ఇలా లేడీ గెటప్ వేసి ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతుంది.

నేను సీఎం కావాలి.. చేస్తారా..?
సినిమాలకు-రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఇక ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి అందులో కూడా చక్రం తిప్పిన వాళ్లు ఉన్నారు. అంతేకాకుండా రాజకీయాల్లోకి వచ్చి ఎదురుదెబ్బ తగిలిన వాళ్లు కూడా ఉన్నారు. ఇక ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఇక్కడ ఒక స్టార్ హీరో కూడా సీఎం కావాలని అనుకుంటున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారా ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. అంతేకాదు తనను సీఎం చేస్తారా అని కూడా అడుగుతున్నాడు. నాకు సీఎం అవ్వాలని ఉంది… ఎన్నికల్లో పోటీ చేస్తే నన్ను గెలిపిస్తారా అంటూట్విట్టర్ లో ఓ లేఖను విడుదల చేశాడు ఉపేంద్ర. ఇప్పుడుఈ లేఖ హాట్ టాపిక్ అయింది.