
ట్యాగ్ · 2 కథనాలు


శాండల్ వుడ్ హీరో, డైరెక్టర్ ఉపేంద్ర 50వ సినిమా

"#NTR 30 "మూవీ లో ఉపేంద్ర ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం" మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. "రౌద్రం రణం రుధిరం" మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న "#NTR 30 "మూవీ కి హీరో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

శాండల్ వుడ్ హీరో, డైరెక్టర్ ఉపేంద్ర 50వ సినిమా
డైలాగ్ రైటర్, లిరిసిస్ట్ గా శాండల్ వుడ్ లో ప్రవేశించిన ఉపేంద్ర 1992 సంవత్సరంలో దర్శకుడి గా మారి తన 25 సంవత్సరాల సినీ కెరీర్ లో 10 సినిమాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా 45 సినిమాలకు పైగా నటించారు. నటుడు, దర్శకుడు ఉపేంద్ర, ఓంకారం, రా, ఉపేంద్ర, కన్యాదానం, s/o. సత్యమూర్తి వంటి మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.