కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hero Srikanth Father Meka Parameswara Rao No More

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

శ్రీకాంత్ కు చిరంజీవి పరామర్శ

గత రాత్రి ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ తండ్రి గారైన పరమేశ్వరరావు మరణించిన సంగతి తెలిసిందే. కాగా పలువురు చలన చిత్ర ప్రముఖులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. శ్రీకాంత్ కు మెగాస్టార్ చిరంజీవి తో ఉన్న సుదీర్ఘ అనుబంధం గురించి అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో చిరంజీవి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయన తండ్రి గారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి శ్రీకాంత్ ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

TFN Adminవాట్సాప్
Actor Srikanth Father Meka Parameswara Rao Passes Away,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Actor Srikanth Father,Hero Srikanth Father Meka Parameswara Rao No More,Srikanth Father Meka Parameswara R
సినిమా వార్తలు

శ్రీకాంత్ కు పితృవియోగం..!

నిన్న కాక మొన్న చిరంజీవి మొదటి సినిమా 'పునాది రాళ్ళు' డైరెక్టర్ రాజ్ కుమార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఇంట విషాదం నెలకుంది. శ్రీకాంత్‌ తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోన్న ఆయన స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న పరిస్థితి మరీ విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక పలువురు సినీ ప్రముఖులు శ్రీకాంత్‌ ఇంటికి చేరుకొని . ఆయనకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆయన పార్ధీవదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్