
ఫస్ట్ లుక్
ట్యాగ్ · 2 కథనాలు



లాంగ్ గ్యాప్ తరువాత సాయి రామ్ శంకర్ ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ అమృత వర్షిణి క్రియేషన్స్ , శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ , రియల్ రీల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎస్ ఎస్ మురళీకృష్ణ దర్శకత్వంలో సాయి రామ్ శంకర్ హీరోగా ఒక మూవీ తెరకెక్కుతుంది. రాశీ సింగ్ కథానాయిక కాగా అరవింద్ కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయి రామ్ శంకర్ "143 "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "నేనింతే ", "బంపర్ ఆఫర్ ", హలో ప్రేమిస్తారా", రోమియో ", నేనో రకం "వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఎస్ ఎస్ మురళీ కృష్ణ దర్శకత్వంలో సాయి రామ్ శంకర్ , రాశీసింగ్ జంటగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "రీసౌండ్ " మూవీ షూటింగ్ 70 శాతం కంప్లీట్ చేసుకుంది.