ట్యాగ్ · 2 కథనాలు

పేద సినీ కళాకారులు, కార్మికులకు రాజశేఖర్ చేయూత
కరోనా ఎక్స్పీరియన్స్ - 10 కేజీలు బరువు తగ్గిపోయా
హీరో రాజశేఖర్ కుటుంబం కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ అందరికీ ఒకేసారి కరోనా రాగ ముందు పిల్లలు శివాని, శివాత్మికలు కరోనా నుండి కోలుకోగా ఆ తర్వాత జీవిత కూడా తొందరగానే కోలుకుంది. అయితే రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై మాత్రం కొన్ని రోజులు టెన్షన్ నడిచింది. కొద్దిరోజులు పలు రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత శివాని, శివాత్మికలే రాజశేఖర్ హెల్త్ గురించి రెగ్యులర్ అప్ డేట్స్ ఇచ్చారు. అయితే చాలా రోజులు టెన్షన్ తర్వాత ఫైనల్లీ రాజశేఖర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.

పేద సినీ కళాకారులు, కార్మికులకు రాజశేఖర్ చేయూత
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా మూవీ షూటింగ్స్ రద్దు అయిన విషయం తెలిసిందే. షూటింగ్స్ రద్దు అయిన కారణంగా పనిలేక పలువురు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రోజూ పనిచేస్తే కానీ ఇల్లు గడవనిపేద సినీ కళాకారులు, కార్మికులకు రాజశేఖర్ తన వంతు సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.