
ట్యాగ్ · 2 కథనాలు


" గోపికమ్మ" కాజల్ అగర్వాల్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , "ది ఘోస్ట్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “ , “రౌడీ బేబీ “ (తమిళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ప్రయోగాత్మక బాలీవుడ్ మూవీ “ఉమ”లో నటిస్తున్న కాజల్ బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'రాధేశ్యామ్' కృష్ణాష్టమి స్పెషల్ పోస్టర్ రిలీజ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజులు అయిపోయిన సంగతి తెలిసిందే. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ పలు ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసినా తరువాత మేకర్స్ సైలెంట్ అయిపోయారు. ఇక ఇన్ని రోజుల తరువాత ఈసినిమా నుండి ఒక అపే డేట్ వచ్చింది. ఈరోజు కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ఈసినిమా నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసి రాధేశ్యామ్ టీమ్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్బంగా విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమకు కొత్త అర్థాన్ని చెప్పనున్నారు అంటూ ట్వీట్ చేయగా.. ప్రస్తుతం ఈపోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది.